కలం, వెబ్ డెస్క్: పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హడావుడి అంతా బోగస్ అని కేసీఆర్ (KCR) విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఈ ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నదని మండిపడ్డారు. గతంలో ఏపీలో చంద్రబాబు ఎన్నో ఎంవోయూలు కుదుర్చుకున్నారని.. అవేవీ కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఎంవోయూలు మొత్తం పెట్టుబడుల రూపంలోకి రావని పేర్కొన్నారు. ‘ఫాక్స్ కాన్(Foxconn) అనే కంపెనీ తెలంగాణకు వచ్చింది. ఆ కంపెనీ కోసం చాలా తండ్లాడినం. మా పాలసీని ఆ కంపెనీ ప్రతినిధులు మెచ్చుకున్నరు. కానీ చివరి నిమిషంలో మహారాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్ల ఇంటెన్సివ్ ఎదురు ఇచ్చి ఆ కంపెనీని కొట్టుకొని పోయింది’ అంటూ కేసీఆర్ గుర్తు చేశారు. ఏ పెట్టుబడి రావాలన్నా ఎంతో చిత్తశుద్ధి ఉండాలని గుర్తు చేశారు. అంతేకానీ ఉట్టిగా హడావుడి చేస్తే ఏ ప్రయోజనం ఉండదని చెప్పారు.
తమ ప్రభుత్వం కంపెనీల కోసం రియల్ ఎఫర్ట్స్ పెట్టిందని KCR చెప్పారు. ఎన్నో తిప్పలుబడి పెట్టుబుడులు తీసుకొచ్చామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హైప్ క్రియేట్ చేసి డ్రామాలు చేస్తుందన్నారు. ‘మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేదు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రోత్ విషయంలో అవగాహన ఉందా? ఒక రూపాయి కూడా రిజిస్ట్రేషన్ చార్జ్ పెంచలేదు. ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఒత్తిడి చేసినా నేను చార్జీలు పెంచలేదు’ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
Read Also: మూసీ ప్రక్షాళన నా ఐడియానే: కేసీఆర్
Follow Us On: X(Twitter)


