Mobile Popup Ad
Mobile Popup Ad

వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. భారత్-ఏకు 66 పరుగుల విజయం

కలం, స్పోర్ట్స్: భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా, బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్-ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. అనంతరం 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఏ 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. భారత్-ఏ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) శుభారంభం అందించారు. ప్రియాంశ్ 29 బంతుల్లో 39 పరుగులు చేయగా, వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం రుతురాజ్ గైక్వాడ్ 51 బంతుల్లో 40 పరుగులు, కెప్టెన్ తిలక్ వర్మ 90 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా 36 పరుగులు జోడించగా, చివర్లో విప్రజ్ నిగమ్ 20 బంతుల్లో 27 పరుగులు, అనుకుల్ రాయ్ 15 బంతుల్లో 39 పరుగులతో వేగంగా ఆడారు. యశ్ ఠాకూర్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

శ్రీలంక-ఏ బౌలర్లలో వనుజ సాహన్ 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రవిందు ఫెర్నాండో, కుగతాస్ మతులన్ తలో 2 వికెట్లు పడగొట్టగా, మొహమద్ షిరాజ్, సహాన్ అరచ్చిగే, దులాజ్ సముదిత తలో వికెట్ సాధించారు.

భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక-ఏకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అవిష్క ఫెర్నాండో 3, నిరోషన్ డిక్వెల్లా 25, నువనిడు ఫెర్నాండో 21 పరుగులకే వెనుదిరిగారు. అయితే సదీర సమరవిక్రమ 44 బంతుల్లో 52 పరుగులు చేసి పోరాడాడు. కెప్టెన్ సహాన్ అరచ్చిగే 38 పరుగులు, రవిందు ఫెర్నాండో 19 పరుగులు చేశారు. మధ్య ఓవర్లలో వనుజ సాహన్ 69 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. విజయకాంత్ వియస్కాంత్ 34 బంతుల్లో 39 పరుగులు, మొహమద్ షిరాజ్ 33 బంతుల్లో 21 పరుగులు, దులాజ్ సముదిత 11 బంతుల్లో 15 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీలంక-ఏ 311 పరుగుల వద్ద ఆలౌటైంది.

భారత్-ఏ బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్ తలో మూడు వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు. అనుకుల్ రాయ్ రెండు వికెట్లు తీయగా, అశోక్ శర్మ, తిలక్ వర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.

Read Also: భార‌త్‌ను చూసి అమెరికా నేర్చుకోవాలి.. ఫారిన్ యువ‌తి ప్ర‌శంస‌లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>