కలం, వెబ్ డెస్క్ : ‘కుల దరిద్రం వదిలితే తప్ప.. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కీలక నేత వంగా గీత (Vanga Geetha) స్పందించారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఆదివారం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో నిర్వహించిన వైసీపీ కాపు నేతల సమావేశంలో పాల్గొన్న ఆమె పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.
కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. తాము ఇవాళ మీటింగ్ పెడుతున్నామని.. నిన్న ఆయన ఏదేదో మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. కులం అవసరం లేదంటూనే.. మళ్లీ ‘నా కులం’ అంటూ ప్రస్తావన తీసుకొస్తారని ఎద్దేవా చేశారు. కులం పుట్టుకతో వస్తుందని సూచించారు. ఈ క్రమంలోనే కులానికి ఏమీ చేయలేకపోయినా సరే.. కులాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దని వంగా గీత (Vanga Geetha) హితవు పలికారు.
Read Also: విజయవాడలో సీఐ నాగరాజు మద్దతుదారుల ఆందోళన!
Follow Us On: X(Twitter)

