Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ ఊరిలో బూతులు తిడితే 500 ఫైన్ కట్టాల్సిందే!

కలం, వెబ్ డెస్క్: ‘నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది’ అనే సామెతను మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని బోర్‌సర్ గ్రామస్తులు అక్షరాలా పాటిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మనుషుల మాట తీరు సరిగ్గా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే ఇతరుపై ఆగ్రహంతో రెచ్చిపోతుంటారు. ఈ క్రమంలో బూతులు కూడా తిడుతుంటారు. అందుకే ఈ గ్రామంలో ఎవరైనా సరే ఇతరులను బూతులు తిడితే వారికి రూ. 500 జరిమానా (Fine) విధించేలా గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. చిన్నతనంలోనే పిల్లలను సంస్కారం అలవడాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను తీసుకువచ్చింది. ఈ నిర్ణయంతో గ్రామంలో పరస్పర గౌరవం పెరిగింది.

అసభ్య పదజాలం వాడితే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూడా రూల్ పెట్టింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి, జరిమానా కట్టలేని పరిస్థితిలో ఉంటే.. గంటపాటు గ్రామ వీధులను ఊడ్చి శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఈ నియమం వల్ల గ్రామంలో క్రమశిక్షణ పెరగడంతో పాటు స్వచ్ఛత కూడా అలవడుతుందని పంచాయతీ భావిస్తోంది. ఈ గ్రామ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రశంసలందుకుంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>