Mobile Popup Ad
Mobile Popup Ad

వైభవ్ విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు!

క‌లం, వెబ్ డెస్క్: భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. దంబుల్లాలో జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్లో శ్రీలంక-ఏపై అతడు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నె పేరిట 21 ఏళ్లుగా ఉన్న 12 బంతుల రికార్డు చెరిగిపోయింది. తన మెరుపు ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదిన వైభవ్ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు.

శతకం దిశగా దూసుకెళ్తున్న సమయంలో శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే అతడిని ఔట్ చేశాడు. దీంతో 29 బంతుల్లో 94 పరుగులు చేసిన వైభవ్ సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలు, 2026 ఆసియా క్రీడల కోసం భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ (Vaibhav Suryavanshi) ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

15 ఏళ్ల 71 రోజుల వయసులో జాతీయ జట్టుకు ఎంపికై సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న 36 ఏళ్ల రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కితే భారత పురుషుల క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా మరో ఘనతను సొంతం చేసుకోనున్నాడు.

Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>