కలం, వెబ్ డెస్క్: చాలా రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్ .. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ విమర్శలకు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ (Madhu Yashki Goud) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఎర్రబెల్లి(Erravalli)లోని ఫామ్‌హౌస్‌లో చలి ఎక్కువైనందుకు.. తట్టుకోలేక బయటకు వచ్చారని సెటైర్లు వేశారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావాలని అప్పుడు చెప్పామని వెల్లడించారు. కానీ ఆయన మాత్రం ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోయాడని మధుయాష్కి గౌడ్ (Madhu Yashki Goud) పేర్కొన్నారు.
తెలంగాణ నేల ఆయనకు కుటుంబానికి పదవులు ఇచ్చిందని.. కేసీఆర్‌ను సీఎం కుర్చీలో కూర్చొబెట్టిందన్నారు. కానీ ఆయన మాత్రం ఓడిపోయాక కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా కూడా పోషించడానికి ఇష్టపడటం లేదని విమర్శించారు.
Read Also: తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్
Follow Us On: Instagram


