కలం, వెబ్ డెస్క్ : తన తండ్రి సర్పంచ్ గా గెలిస్తే భిక్షాటన చేస్తా అంటూ ఓ కొడుకు వింత మొక్కును మొక్కుకున్నాడు. మెదక్ (Medak) జిల్లాలో రామాయంపేట మండలంలోని ఝాన్సి లింగాపూర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తండ్రి రామకిష్టయ్య తో పాటు ఆయన పెద్ద కుమారుడు వెంకటేష్ బరిలో నిలబడ్డారు. అయితే, తండ్రి సర్పంచ్ గా గెలువాలని చిన్నకొడుకు భాస్కర్ వింతగా మొక్కుకున్నాడు. కాగా, ఎన్నికల్లో కొడుకు వెంకటేష్ పై గెలిచి సర్పంచ్ అయ్యాడు.
తండ్రి గెలుపుతో తన మొక్కు తీర్చుకునేందుకు భాస్కర్ భిక్షాటన చేశారు. భుజానికి జోలె, చేతిలో కర్రతో కాళ్లకు చెప్పులు లేకుండా భాస్కర్ సొంత గ్రామంలో అడుకున్నాడు. ఈ వింత ఘటనపై మొదట గ్రామస్థులు ఆశ్చర్యపోయినా.. తండ్రిపై అతడికి ఉన్న అభిమానాన్ని మెచ్చుకున్నారు. ప్రస్తుత కాలంలో ఆస్తుల కోసం తల్లిదండ్రులకు ఇబ్బందులు పెడుతూ.. హత్యలు చేస్తున్న రోజుల్లో ఇలాంటి కొడుకు ఉండటం మంచి విషం అని అంటున్నారు. ఈ కొడుకును చూసి.. మూర్ఖంగా ఉండే కొందరు.. తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ పై సిట్ కీలక సమావేశం
Follow Us On: Youtube


