కలం, వెబ్ డెస్క్ : వరంగల్ హన్మకొండకు చెందిన 16 ఏళ్ల పానుగోటి నిరంజన్ (Niranjan) తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతూ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సినీ నిర్మాత, పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గణేష్ (Bandla Ganesh) మానవత్వంతో స్పందించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు.
చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కలవాలనేది నిరంజన్ యొక్క బలమైన కోరిక. మీడియా మిత్రుల సహకారంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. దీనిపై స్పందించిన జనసేనాని నిరంజన్ కోరికను నెరవేర్చడానికి, అతడిని స్వయంగా కలవడానికి హన్మకొండకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈ సందర్భంగా తెలియజేశారు. నిరంజన్ కోరిక నెరవేరడం, అలాగే బండ్ల గణేష్ పెద్ద మనసుతో సహాయం చేయడంపై అభిమానులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అభిమాని కోరిక తీర్చిన పవన్.. నిరంజన్ కు పరామర్శ!
Follow Us On: Sharechat

