కలం, వెబ్ డెస్క్: కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటేనే ఓట్లు భద్రంగా ఉంటాయని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. సర్ ప్రక్రియ జరుగనున్న నేపథ్యంలో కార్యకర్తలు సరిగా పని చేయకపోతే తల్లిలాంటి పార్టీకి మోసం చేసినట్లేనని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కేడర్ కష్టపడి పని చేశారని, కాంగ్రెస్ అబద్దపు హామీలు చూసి ప్రజలు మోసపోయారని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మోసాలను ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ (KCR) ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తున్నాడని చెప్పారు. కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాటితో పాటు, హామీ ఇవ్వని పథకాలు కూడా అందించాడని, రేవంత్ రెడ్డి మాత్రం కనీసం ప్రజలకు హామీ ఇచ్చినవి కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమని, కేసీఆర్‌ను అనవసరంగా ఓడగొట్టుకున్నామని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రైతు బంధు నాడు టైంకు పడిందని, ఇప్పుడు నెలలు గడుస్తున్నా దిక్కు లేదని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని, ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్ (SIR) ప్రక్రియలో పోలింగ్ బూత్ ఏజెంట్లు బాధ్యత సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సర్ ప్రక్రియపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి బూత్ ఏజెంట్లుగా బాధ్యతలు తీసుకున్న వారు ఇంటింటికీ వెళ్లి సర్ ప్రక్రియను గమనించాలని సూచించారు.
Read Also: ఆ దమ్ము, పౌరుషం పొంగులేటికి ఉందా?: కేటీఆర్ సవాల్!
Follow Us On: Instagram

