కలం వెబ్ డెస్క్ : ఖమ్మం(Khammam)లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు(RTC Bus) ఆగి ఉన్న లారీ(ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో 36 మందికి గాయాలయ్యాయి. తిరుమలాయపాలెం మండలం చంద్రతండా శివారులో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం ఖమ్మం నుంచి వరంగల్ వస్తున్న లారీని డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడు. ఖమ్మం నుంచి బోధన్(Bodhan) వైపు వెళ్తున్న ఓ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఆ సమయంలో లారీ కింద ఉన్న క్లీనర్ నితీశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై జగదీశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఖమ్మం(Khammam) ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: దారుణం.. బీమా సొమ్ము కోసం తండ్రి హత్య
Follow Us On: X(Twitter)


