కలం, వెబ్ డెస్క్ : బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారీగా తగ్గిన బంగారం ధరలు (Gold Price).. మళ్లీ రెక్కలు విప్పుతున్నాయి. గత వారం నుంచి ప్రతిరోజూ పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.134210 దాకా ఉంది. అయితే వచ్చే 2026లో తులం బంగారం ధర రూ.లక్షా 50వేల నుంచి రూ.లక్షా 60వేలు దాటే అవకాశాలు ఉంటాయని గోల్డ్ మన్ శాక్స్ (Goldman Sachs) సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి ఇంకా కొనసాగుతోందని.. యుద్ధాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్ లో గోల్డ్ కీ రోల్ ప్లే చేస్తుందని తెలిపారు.
అమెరికా టారిఫ్ లు, గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు ఇంకా పెరుగుతున్నాయి బంగారం ధరలు (Gold Price) క్రమంగా పెరుగుతాయని అంచనా వేసింది గోల్డ్ మన్ శాక్స్ కంపెనీ. ఇండియాలో గోల్డ్ ధరలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని.. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో గోల్డ్ కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది ఈ సంస్థ.
Read Also: టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు
Follow Us On: Youtube


