నేడు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌లో పరేడ్.. రానున్న మంత్రి రాజ్‌నాథ్‌

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం గ్రాడ్యుయేషన్ పరేడ్‌ (Air Force Academy Graduation Parade) నిర్వహించనున్నారు. పరేడ్ రివ్యూయింగ్ ఆఫీసర్‌గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) హాజరుకానున్నారు. దీంతో మంత్రి రానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి ఎన్‌డీఏ మహిళా క్యాడెట్ల కమిషనింగ్‌కు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ వేదిక కానుండటం విశేషంగా చెప్పొచ్చు. ఈ పరేడ్ లో సుఖోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏ.పీ.సింగ్‌ నేతృత్వంలో ఫ్లైపాస్ట్, ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైనీలకు వింగ్స్, బ్రెవెట్స్ లను అందజేయనున్నారు. ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వియత్నాం ట్రైనీలకూ ధ్రువపత్రాల ప్రదానం చేయనున్నారు. మెరిట్‌లో అగ్రస్థానంలో నిలిచిన క్యాడెట్లకు ‘ప్రెసిడెంట్స్ ప్లాక్‌’ అవార్డులు అందజేసి గౌరవించనున్నారు. పరేడ్ ప్రారంభంలో ఆకాష్‌గంగా, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ విన్యాసాలు ప్రదర్శించనుండటంతో పరేడ్ ను వీక్షించడానికి ఔత్సాహికులు వేచిచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>