రఘునాథపల్లి హైవేపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

కలం, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి (Raghunathpally) మండలంలోని గోవర్ధన్ గిరి దర్గా సమీపంలో శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఎర్టిగా కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు అతివేగం కారణంగా అదుపు తప్పి రోడ్డుపై నుండి పక్కకు దిగి కాలువలో పడిపోయింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో హనుమకొండ నయీమ్ నగర్‌కు చెందిన హబీబ్ హఫ్సా (27), అసదుద్దీన్ (26) అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి, జనగామకు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>