కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ప్రముఖ నిలోఫర్ కేఫ్ (Niloufer Cafe) వాణిజ్య భవనానికి తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్వహిస్తున్న ఈ భవనం ఫైర్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)ను అధికారులు రద్దు చేశారు.
ఇటీవల అగ్నిమాపక శాఖ అధికారులు ఈ భవనంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భవనం నాలుగో అంతస్తుపై ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయి రూఫ్‌టాప్ రెస్టారెంట్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఉల్లంఘనలు ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర ప్రమాదకరమని భావించిన ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ (IPS), సదరు భవనం ఫైర్ ఎన్ఓసీని తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా అగ్నిమాపక భద్రతా నియమాలను పాటించాలని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.
Read Also: స్వయంగా చీపురు పట్టి స్కూల్ శుభ్రం చేసిన బండి సంజయ్
Follow Us On: Instagram

