కలం, ఖమ్మం బ్యూరో : ప్రపంచ స్థాయి పోటీలకు మన విద్యార్థులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) తెలిపారు. శనివారం ఖమ్మం(Khammam) నగరం బల్లేపల్లిలోని ఎస్.ఎఫ్.ఎస్ స్కూల్లో జిల్లా స్థాయి ఇన్ స్పైర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. 900 ఎగ్జిబిట్స్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ఎగ్జిబిషన్ కు రావడం మన పిల్లల సృజనాత్మకతకు నిదర్శనమని, ఇది చాలా సంతోషకరమని అన్నారు. విజ్ఞాన ప్రదర్శనల వల్ల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రులు పడే కష్టాలను చూసి కొంత మంది విద్యార్థినులు ఆలోచించి వ్యవసాయ పనులన్ని చేసేలా ఒక యంత్రాన్ని తయారు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా పిల్లలు గొప్ప గొప్ప ఆలోచనలు చేయాలని, కలలు కని, వాటిని సాకారం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఖమ్మం జిల్లా విద్యారంగంలో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) మాట్లాడుతూ ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఇన్ స్పైర్ వైజ్ఞానిక ఎగ్జిబిషన్ కార్యక్రమానికి 900 పైగా ఎగ్జిబిట్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిఈవో చైతన్య జైని, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, కార్పొరేటర్లు మల్లీదు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: నాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే
Follow Us On: X(Twitter)


