epaper
Friday, January 16, 2026
spot_img
epaper

సినీ గ్లామర్‌తో తెలంగాణ బీజేపీకి లాభమెంత?

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీకి (Telangana BJP) సినీ గ్లామర్ ఎంతమేర వర్కవుట్ అవుతుంది? గతంలో ఆ పార్టీలో చేరిన సినీ నటులతో ఎంత మేర ప్రయోజనం కలిగింది. అసలు ఆ నేతలు రాజకీయంగా ఎదిగారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. విజయశాంతి (VijayaShanthi) మినహా ఆ పార్టీలో చేరిన నటీమణులు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మరి తాజాగా బీజేపీలో చేరిన ఆమని ఎంత మేర విజయం సాధిస్తారో వేచి చూడాలి. తెలంగాణ బీజేపీలో గతంలో చేరిన సినీ నటిమణులు ఎంతమంది? వారి ఎంతమేర రాణించారు? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.

నటీమణులు బలం అవుతారా?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ (Telangana BJP) కాస్త బలహీనంగానే ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఆ తర్వాత ఆ స్థాయిలో పుంజుకోలేకపోయింది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం నామమాత్రమే. తెలంగాణలో బీజేపీని ఎలాగైనా బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇందుకోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. అందుకోసం ఉన్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమనిని ఎన్నికల బరిలో దించుతారా? లేదంటే అధికార ప్రతినిధిగా నియమించి కేంద్ర పథకాలను ప్రజలకు వివరించమని పురమాయిస్తారా? అన్నది వేచి చూడాలి.

జయసుధ చేరికతో బీజేపీకి లాభమెంత?

జయసుధ (Jayasudha) గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొంతకాలం రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా లేరు. అనంతరం 2023లో బీజేపీలో చేరారు. ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తారన్న ఊహాగానాలు కూడా నడిచాయి. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. ఆమె ప్రస్తుతం పొలిటికల్‌గా పెద్దగా యాక్టివ్ రోల్ పోషించడం లేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద పొగడ్తలు గుప్పించడంతో ఆ పార్టీలోకి వెళ్తారేమోనన్న చర్చ కూడా సాగింది. ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) సైతం 2021లో బీజేపీ గూటికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకే ఆమె పరిమితం అయ్యారు. ఆమె నేరుగా బరిలో నిలవలేదు. టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత సైతం బీజేపీలో చేరారు. ఆమె సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయ్యారు.

అనేక పార్టీలు మారిన విజయశాంతి

‘లేడీ సూపర్‌స్టార్’గా పేరొందిన ప్రముఖ నటి విజయశాంతి.. 1990లలో బీజేపీలో చేరారు. కానీ 2005లో ఆమె బీజేపీని వీడి తల్లి తెలంగాణ అనే పార్టీ స్థాపించారు. 2020లో మరోసారి బీజేపీలో చేరారు. నవంబర్ 2023లో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీజేపీలో మహిళా మోర్చాలో జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. కానీ విజయశాంతి కూడా బీజేపీలో నిలదొక్కుకోలేకపోయారు.

జాతీయ స్థాయిలోనూ..

జాతీయ స్థాయిలో అనేక మంది సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సన్నీ డియోల్ 2019లో బీజేపీలో చేరారు. గురుదాస్‌పూర్ ఎంపీగా 2019, 2024లో విజయం సాధించారు. కంగనా రనౌత్ 2024లో మండి (హిమాచల్ ప్రదేశ్) ఎంపీగా గెలుపొందారు. రూపాలి గంగూలీ ప్రముఖ టీవీ నటి (అనుపమా), 2024లో చేరారు. జయప్రద 2019లో బీజేపీలో చేరారు. రవికిషన్ గోరఖ్‌పూర్ ఎంపీ (2019, 2024). మనోజ్ తివారి ఉత్తర తూర్పు ఢిల్లీ ఎంపీ 2014 నుంచి కొనసాగుతున్నారు. సురేష్ గోపి మలయాళ నటుడు 2024లో త్రిశూర్ ఎంపీగా గెలుపొందారు. కేరళ నుంచి బీజేపీకి తొలి ఎంపీగా విజయం సాధించారు. అరుణ్ గోవిల్ రామాయణం సీరియల్‌లో రాముడిగా ప్రసిద్ధి పొందారు. 2024లో మీరట్ నుంచి పోటీ చేశారు. హేమా మాలిని, కిరణ్ ఖేర్, పరేష్ రావల్ వంటి వారు సుదీర్ఘంగా బీజేపీలో కొనసాగుతున్నారు. బాలీవుడ్ ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు బీజేపీలో రాణించారు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి నటులు, నటీమణులు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. కృష్ణంరాజు కేంద్రసహాయమంత్రి దాగా ఎదిగిన ఆ తర్వాత పెద్దగా క్రియాశీలకంగా పనిచేయలేదు.

Read Also: మెడికల్​ కాలేజీల్లో సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ : మంత్రి దామోదర

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>