కలం, వెబ్ డెస్క్ : కొన్ని రోజులుగా కోడిగుడ్డు మీద ఓ పెద్ద ప్రచారం జరుగుతోంది. కోడిగుడ్డు తింటే క్యాన్సర్ వస్తోందని దానికి దూరంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి. దీనిపై తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) క్లారిటీ ఇచ్చింది. కోడిగుడ్డుతో ఎలాంటి క్యాన్సర్ రాదని స్పష్టం చేసింది. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేసింది. అందరూ కోడిగుడ్డును తినొచ్చని చెప్పింది. మానవ శరీర మనుగడకు కోడిగుడ్డు ఎంతో అవసరం అని చెప్పింది. గుడ్లలో ఉండే హానికర ‘నైట్రోఫ్యూరాన్ల’ వాడకాన్ని 2011 నుంచే తగ్గించినట్టు స్పష్టం చేసింది. కొన్ని గుడ్లలో ఈ నైట్రోఫ్యూరాన్లు ఏమైనా కనిపించినా అవి బాడీకి చెడు చేయవని తెలిపింది ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ (FSSAI). గుడ్ల వల్ల మంచి ప్రోటీన్లు లభిస్తాయని.. అవి బాడీకి అవసరం అంటూ తెలిపారు అధికారులు.
Read Also: జీలకర్ర నీటితో కొవ్వు కరుగుతుందా? అసలు రహస్యం ఇది..!
Follow Us On: X(Twitter)


