కలం/ఖమ్మం బ్యూరో : జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అక్రిడిటేషన్ కార్డుల (Accreditation Cards) ప్రక్రియ తుదిదశకు చేరుకుందని.. మరో 10 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti). అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా మహాసభలకు ఆయన చీఫ్ గెస్ట్ గా రావాల్సి ఉన్నా.. బిజీ షెడ్యూల్ వల్ల ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు.
ఇళ్ల స్థలాలపై స్పష్టత..
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (Accreditation Cards) తోపాటు ఇళ్ల స్థలాల అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని.. త్వరలోనే దాన్ని క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో ఇండ్ల స్థలాలపై గుడ్ న్యూస్ చెప్తామన్నారు. జర్నలిస్టు యూనియన్ నాయకులు అందరూ కలిసికట్టుగా మెరుగైన సమాజం కోసం పనిచేయాలన్నారు.
Read Also: పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు..!
Follow Us On: Pinterest


