కలం, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి ఆమని (Actress Amani) భారతీయ జనతా పార్టీ (BJP)లో అధికారికంగా చేరారు. ప్రజా సేవే తన లక్ష్యమని బీజేపీలో చేరడం ద్వారా ఆ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నానని ఆమె తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ఆమని (Actress Amani) కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమనితో పాటు మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆమని మీడియాతో మాట్లాడుతూ.. పీఎం మోడీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారన్నారు. మనం భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని తెలిపారు. తాను కూడా మంచి పనులు చేయాలని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరానని ఆమె పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని (Actress Amani) 1992లో ‘జంబలకిడిపంబ’ చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. అనంతరం మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి హిట్ చిత్రాల్లో నటించారు.
Read Also: క్రిస్మస్, న్యూ ఇయర్ రష్.. దేశవ్యాప్తంగా 244 స్పెషల్ ట్రైన్స్ రయ్ రయ్
Follow Us On: X(Twitter)


