కలం వెబ్ డెస్క్ : టీ20 ప్రపంచ కప్ (T20 World Cup)-2026 టోర్నమెంట్ కు బీసీసీఐ(BCCI) భారత జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను వెల్లడించింది. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లోనూ ఇదే జట్టు ఆడుతుందని బోర్డు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 7 నుంచి టీ20 వర్డల్ కప్ ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), వైస్ కెప్టెన్‌గా అక్షర పటేల్ ను నియమించారు. వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌కు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు.
T20 World Cup టీం:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్) అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ జట్టులో ఉన్నారు.
Read Also: రీల్స్ పిచ్చి.. బ్రిడ్జిపై వేలాడుతూ పుల్ అప్స్.. ఇంత రిస్క్ అవసరమా?
Follow Us On: Sharechat


