మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా దాడులు షురూ..!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరాన్, అమెరికా (US Iran Tensions) మధ్య మళ్లీ యుద్ధం షురూ అయింది. తమ సైన్యానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపిస్తుంది. మంగళవారం తెల్లవారుజామున ఒమన్ తీరం వెంబడి హర్మూజ్‌ సమీపంలో గస్తీ చేస్తున్న తమ మిలిటరీ హెలికాప్టర్ ఏహెచ్ 64 అపాచీ ని కూల్చి వేసిందని.. అందులో ఉన్న తమ ఇద్దరు పైలట్లను ఓ డ్రోన్ బోట్ సహాయంతో రక్షించినట్లు అమెరికా చెబుతోంది.

ఈ క్రమంలోనే దీనికి ప్రతిస్పందనగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Trump) హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా సైనిక చర్య షురూ అయింది. ఈ మేరకు అన్యాయమైన దురాక్రమణకు ప్రతిస్పందనకు ఆపరేషన్ చేపట్టినట్లు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటన చేసింది.తమ సైన్యాన్ని సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆత్మరక్షణ దాడులేనని స్పష్టం చేసింది. అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ ఇరాన్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read Also: CM రేవంత్ ధీమా.. ఎమ్మెల్యేల్లో డైలమా.. కారణమదేనా??

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>