నాగార్జున‌సాగ‌ర్ ఎస్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో హరితహారం

కలం. నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్‌ (Nagarjunasagar)లో మంగళవారం నాగార్జునసాగర్ యూనిట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పీఎఫ్‌ యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ రాజు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎస్‌పీఎఫ్‌ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డీఐజీ మాధవరావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమాండెంట్ కార్యాలయం, ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో పలు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు.

ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించుకునే బాధ్యత చేపడితే పర్యావరణ పరిరక్షణతో పాటు, జీవన మనుగడకు సహకారం అందించిన వార‌వుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ డ్యాం ఎస్‌పీఎఫ్‌ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐలు రఘు, వెంకటేశ్వర్లు, ఏఎ లు పుల్లయ్య, రవీందర్, యూసుఫ్, జెన్కో, సాగర్ డ్యాం సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>