కరీంనగర్‌లో ఘనంగా ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధి నాలుగో డివిజన్ దుర్షేడ్ ఎల్లమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న దేవాలయం నుంచి ఎల్లమ్మ దేవాలయం వరకు ఏర్పాటు చేసిన నూతన స్ట్రీట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే నగరపాలక సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగో డివిజన్ కార్పొరేటర్ భూపతి రవీందర్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>