కలం వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమైన హారర్ థ్రిల్లర్(Horror Thriller) ‘ఈషా’ మూవీ(Eesha Movie) నుంచి మరో సంచలన వీడియో విడుదలైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, తాజాగా ‘ఈషా వార్నింగ్'(Eesha Warning) పేరుతో నిర్మాతలు ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లిటిల్ హార్ట్స్(little hearts), రాజు వెడ్స్ రాంబాయి(Raju weds Rambai) వంటి సూపర్ హిట్ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన బన్నీ వాస్(Bunny Vas), వంశీ నందిపాటి కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని పక్కా హారర్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబ్బా పటేల్(Hebah Patel) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సిరి హనుమంతు(Siri Hanumanthu), బబ్లూ, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్నింగ్ వీడియోలో మనుషుల్లాగానే కొన్ని ప్రదేశాలు పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయని, అవి క్రమంగా ఆత్మలకు నిలయాలుగా మారతాయని దర్శకుడు హెచ్చరించారు. ఈ వీడియోలోని సడన్ ట్విస్ట్‌లు, హారర్ సీన్స్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా సిరి డైలాగ్స్ అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. కథలో ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితులు మూఢనమ్మకాలు, దొంగ బాబాలను ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వారికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. సైన్స్, అతీంద్రియ శక్తుల మధ్య జరిగే క్లాష్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. వీక్ హార్ట్ ఉన్నవారు సినిమా చూడకూడదంటూ మేకర్స్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వస్తున్న ‘ఈషా(Eesha Movie)’ ప్రచార చిత్రాలతోనే ఇంత భయం కలిగిస్తోందంటే, ఫుల్ మూవీ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: టాలెంటెడ్ రైటర్స్ కోసమే.. ప్రభాస్ బంఫర్ ఆఫర్
Follow Us On: Sharechat


