కలం, నిర్మల్ : బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద విషాదం నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వెళ్ళిన ముగ్గురు భక్తులు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని కాచిగూడ చప్పల్ బజార్ కు చెందిన ఓ కుటుంబంసభ్యులు మంగళవారం రైలులో అమ్మవారి దర్శనానికి వచ్చారు. దర్శనానికి మొదట గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నదిలోకి దిగారు. అందులో లోతును అంచనా వేయలేక ముగ్గురు భక్తులు చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేశ్ కుమార్ (31)లు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న బాసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కళ్లముందే నదిలో కొట్టుకుపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
Read Also: GHMC ఫైట్.. పార్టీల పోటాపోటీ వ్యూహాలు
Follow Us On : WhatsApp

