కలం వెబ్ డెస్క్ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(Chief Election Commissioner) జ్ఞానేశ్‌కుమార్(Gyanesh Kumar) రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు హైదరాబాద్(Hyderabad)కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న సీఈసీకి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డి సహా ఎన్నికల విభాగం ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు.
నేడు సాయంత్రం ఆయన(Chief Election Commissioner) రోడ్డు మార్గం ద్వారా ఏపీలోని శ్రీశైలం ఆలయాలనికి వెళ్తారు. ఆదివారం ఉదయం దైవ దర్శనం అనంతరం హైదరాబాద్‌కు వస్తారు. అనంతరం నగరంలో గోల్కొండ ఫోర్ట్, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, రామోజీఫిలిం సిటీ తదితర చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం రవీంద్రభారతిలోని ఆడిటోరియంలో ఎన్నికల నిర్వహణలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర బూత్ లెవెల్ అధికారుల(BLO)తో సమావేశమై కీలక సూచనలు అందిస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
Read Also: అడవి బిడ్డ అరుదైన ఘనత.. నాడు బానిస కూలీ, నేడు సర్పంచ్
Follow Us On: Youtube


