కలం, వెబ్ డెస్క్: గత కొన్ని నెలలుగా ఢిల్లీ (Delhi)ని దట్టమైన పొగమంచు వీడటం లేదు. అటు గాలి నాణ్యత తగ్గిపోవడం, ఇటు పొగమంచు కారణంగా ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 50 శాతమంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నా, ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలు ఆగినా.. పాత కార్లకు చెక్ పెట్టినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. శనివారం ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కసారిగా విజిబులిటీ తగ్గడంతో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇవాళ ఉదయం ఉదయం 7 గంటలకు AQI 433 వద్ద నమోదైంది. దీంతో వాహనదారులు హెడ్‌లైట్లు వెలిగించి డ్రైవింగ్ చేస్తున్నారు. పొగమంచు కారణంగా విమాన సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేస్తున్నాయి. పలు విమానాల వేళల్లో మార్పులు చేయబడ్డాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఆవరించి ఉండటంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 380 ‘వెరీ పూర్’ కేటగిరీలోకి చేరింది. ఆది, సోమవారం కూడా ఢిల్లీ(Delhi)లో విజిబులిటీ ( Visibility) తగ్గే అవకాశాలున్నాయి. పరిస్థితుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.
Read Also: తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన
Follow Us On: Pinterest


