ఓటీటీ క్రైమ్ కంటెంట్ ఔటాఫ్​ కంట్రోల్​… నేరుగా నట్టింట్లోకి!!

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌‌లో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడో మాజీ జవాన్… డెడ్‌‌బాడీ ముక్కలను కుక్కర్‌‌‌‌లో ఉడకబెట్టి, ఆపై ఎముకలను పొడి చేశాడు! ఢిల్లీలో లివింగ్ పార్ట్​నర్‌‌‌‌ను ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టాడో వ్యక్తి! శత్రువులను చంపడానికి ఓ వ్యక్తి క్లోరోఫామ్, ఇతర పాయిజన్ టెక్నిక్స్ ఉపయోగించాడు…. ఈ దారుణాలన్నింటికీ ఓటీటీల్లో వచ్చిన క్రైమ్/థ్రిల్లర్ కంటెంటే కారణం!! ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే!! OTT లు వచ్చాక దేశవ్యాప్తంగా క్రైమ్స్‌‌, సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి.

చాలా నేరాలకు ఓటీటీల్లోని క్రైమ్/థ్రిల్లర్‌‌‌‌ సిరీస్‌‌లే ఆధారమవుతున్నాయి. నేరం ఎలా చేయాలి? దాని నుంచి తప్పించుకునేందుకు ఆధారాలను ఎట్ల మాయం చేయాలి? అనేది కళ్లకు కట్టినట్టుగా వెబ్‌‌ సిరీస్‌‌లు చూపిస్తున్నాయి. ఓటీటీ కంటెంట్‌‌ ద్వారా తాము ప్రభావితమవుతున్నామని 65 శాతానికి పైగా యువత చెప్పడం, గత ఐదేండ్లలో ‘కాపీ క్యాట్ క్రైమ్స్ (సినిమాలు/సిరీస్‌‌లు చూసి చేసే నేరాలు)’ దాదాపు 20 శాతం పెరగడం.. OTT లు నేరాల ట్రైనింగ్‌‌కు అడ్డాగా మారాయని స్పష్టం చేస్తున్నాయి. ఓటీటీ కంటెంట్ కారణంగా క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయని పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం చర్యలు నామమాత్రమే!!

క్రైమ్స్‌‌కు అడ్డాగా మారిన ఓటీటీలపై ‘కలం 360 డిగ్రీస్ స్పెషల్’ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: జిల్లాల్లో కాంగ్రెస్ జెండా.. క్యాబినెట్ మరో బిగ్ డెసిషన్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>