కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వేలుమణి వర్గంలోని ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ స్పీకర్ ను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అనంతరం వారు టీవీకే మంత్రి అదవ్ అర్జునను కలిశారు. వీరంతా ఉప ఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇటీవల అసంబ్లీలో బలపరీక్ష సమయంలో వేలుమణి వర్గం టీవీకే అధినేత విజయ్ కి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే.

