కలం, సోనాల: బీఆర్ఎస్ పార్టీలో యువత చేరికలు పెరుగుతున్నాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోనాల మండలం (Sonala Mandal) వజ్జర్ గ్రామానికి చెందిన 100 మంది యువకులు మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని, పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

