కలం, మెదక్ బ్యూరో : బస్సులో సీటు కోసం యువకుడు చూపించిన అత్యుత్సాహం తన ప్రాణాల మీదకు తెచ్చింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జహీరాబాద్ (Zaheerabad) పట్టణానికి చెందిన అబ్దుల్ ఖదీర్(32) ప్రయాణం కోసం జహీరాబాద్ బస్టాండుకు వచ్చాడు. కర్ణాటక ఆర్టీసీ (KSRTC) బస్సు రాగానే ఎలాగైనా సీటు దక్కించుకోవాలన్న ఆరాటంతో, కిటికీలోంచి లోపలికి దస్తీ (కర్చీఫ్) వేసేందుకు ప్రయత్నించాడు.
బస్సు కదులుతుండగానే పక్కన పరుగెడుతూ కర్చీఫ్ వేస్తుండగా, ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడిపోయాడు. దురదృష్టవశాత్తు అప్పుడే కదులుతున్న బస్సు వెనుక టైరు ఖదీర్ రెండు కాళ్లపై నుంచి వెళ్ళింది. ప్రమాదంలో అతని రెండు కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయాయి. ఈ ప్రమాదంలో ఖదీర్ తీవ్రంగా గాయపడ్డాడు. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి ఖదీర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.


