epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రెబల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

కలం, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న హై వోల్టేజ్ మూవీ స్పిరిట్ (Spirit). ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించేశారు సందీప్ రెడ్డి వంగా. చడీ చప్పుడు లేకుండా స్పిరిట్ మీద అప్డేట్లు ఇస్తూ హైప్ పెంచుతున్నాడు డైరెక్టర్ వంగా. ఈ భారీ యాక్షన్ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఈ మేరకు సందీప్ రెడ్డి రిలీజ్ వీడియోను పోస్టు చేశారు.

స్పిరిట్ (Spirit) లో పోలీస్ కథతో పాటు మాఫియా బ్యాక్ డ్రాప్ ను చూపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ప్రభాస్, త్రిప్తి డిమ్రి లుక్ మీద భారీ హైప్ వచ్చేసింది. సినిమాను అనౌన్స్ చేసినప్పుడు సౌండ్ స్టోరీ పేరుతో ఓ ఆడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రకాష్​ రాజ్ వాయిస్ వినిపించింది. ప్రభాస్ పాత్ర గురించి ఇచ్చిన హైప్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. ఆ తర్వాత పోస్టర్లతోనే సందీప్ హైప్ పెంచుతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>