కలం, వెబ్ డెస్క్ : నేడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేయబడింది. ఈ మూసివేత దాదాపు పదిన్నర గంటలపాటు కొనసాగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తెలిపారు. నేడు ఉదయం 9 గంటల నుండే స్వామి వారి దర్శనాలను నిలిపి వేసి, ఆలయ ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణ (Lunar Eclipse) సమయంలో పవిత్ర స్థలాల భద్రత, ధార్మిక ఆచారాల నిశ్శబ్దతను కాపాడడం కోసం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వివరించారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత, తిరుమల ఆలయం మళ్లీ భక్తుల కోసం తెరవబడుతుంది.

