కలం, వెబ్ డెస్క్ : ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి (Nadendla Brahmam Chowdhury) హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన వైద్యులు, అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం సర్జరీ అనంతరం ఆయనను ఐసీయూ (ICU)కు తరలించి, వైద్యుల నిరంతర పరిశీలనలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఇటీవలే టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమి శ్వేతను వివాహం చేసుకున్నారు. ఆయన హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.

