Mobile Popup Ad
Mobile Popup Ad

ఫాద‌ర్స్ డే.. జ‌గ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

క‌లం, వెబ్ డెస్క్: నేడు వరల్డ్​ ఫాద‌ర్స్ డే (Fathers Day) సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ త‌మ తండ్రుల‌కు పిల్ల‌ల‌కు విషెస్ చెప్తూ, వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) త‌న తండ్రి వైఎస్ఆర్‌ (YSR)ను స్మ‌రించుకుంటూ ఎక్స్ వేదిక‌గా ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. త‌న‌ జీవితంలో చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి త‌న తండ్రి వైయస్ఆర్ అని జ‌గ‌న్ భావేద్వ‌గానికి గుర‌య్యారు. ప్రజల పట్ల ప్రేమతో ఉండాల‌ని, నిస్వార్థంగా సేవ చేయాల‌ని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల‌ని తన తండ్రి చెప్ప‌డాని గుర్తు చేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాల‌న్న‌ది త‌న తండ్రి నుంచే నేర్చుకున్న‌ట్లు వెల్ల‌డించారు. తండ్రి చూపిన మార్గం, నేర్పిన విలువలు ప్రతి రోజూ త‌న‌కు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పని చేసే శక్తిని ఇస్తున్నాయ‌ని జ‌గ‌న్ త‌న పోస్టులో పేర్కొన్నారు. ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా త‌న తండ్రిని స్మరించుకుంటూ అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>