నేడు పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) నేడు పార్టీ ముఖ్య నేతలో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ. 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రీజనన్ కోఆర్డనేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొననున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ భేటీలో వైఎస్ జగన్ చర్చించనున్నారు. అలాగే పార్టీ క్యాడర్ ను బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడం, సర్ ప్రక్రియ తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు వైఎస్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>