కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో (Delhi Rains) కురిసిన భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం కారణంగా పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనక్‌పురిలో అత్యధికంగా 70 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షం, నీటి నిల్వ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటంతో నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 15 విమానాలను వేరే ప్రాంతాలకు దారి మళ్లించారు. నిరంతరం కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు బయటకు రావడానికి నానా తంటాలు పడుతున్నారు.

