కలం, వెబ్‌డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందుల (Pulivendula)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. పోలింగ్ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిగ్గింగ్ జరుగుతోందని, ఎన్నికల అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పులివెందుల ఆర్వో ఆఫీస్ దగ్గర జగన్, ఎంపీ అవినీశ్ నిరసన తెలిపారు. ఆ తర్వాత జగన్ తమ అభ్యర్థులు, ఏజెంట్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను ఓటు వేస్తే ఎన్నికల ప్రక్రియ సవ్యంగానే జరిగిందన్నట్లు ప్రచారం చేస్తారని, అందుకే ఓటు వేయడం లేదని వెల్లడించారు. ఏపీలో ప్రజాస్వామ్యం బతికి ఉంటే రీపోలింగ్ నిర్వహించాలని, అప్పుడే మళ్లీ వచ్చి ఓటు వేస్తామని స్పష్టం చేశారు.

