జగిత్యాలకు ఈపీఎఫ్ఓ కార్యాలయం.. బీడీ కార్మికుల డిమాండ్

కలం, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని(EPFO Office) ఏర్పాటు చేయాలని బీజేపీ బీడీ కార్మిక సెల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. జిల్లా కన్వీనర్ కట్టా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్మికులు ఎంపీని కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో లక్షలాది మంది మహిళా బీడీ కార్మికులు, ప్యాకర్స్, చాటింగ్, బట్టీ కార్మికులు, కమిషన్ ఏజెంట్లు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ రీజినల్ కార్యాలయాలు కరీంనగర్, నిజామాబాద్‌లో ఉండటంతో చిన్న చిన్న పనులకు కూడా కార్మికులు పని మానుకొని, కుటుంబాన్ని వదిలి అక్కడికి వెళ్లాల్సి వస్తోందన్నారు. డెత్ సర్టిఫికెట్, జెన్యూనిటీ సర్టిఫికెట్ వంటి పనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అలాగే 1995 చట్టం ప్రకారం 58 ఏళ్లకు రూ.2000 పెన్షన్ వస్తుండగా, 50 ఏళ్లకే తీసుకుంటే 32% కోతతో రూ.1320 మాత్రమే వస్తోందని, కనీస పెన్షన్ ను రూ.1000 నుండి రూ.5000 కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ బండారి ప్రభాకర్, బండారి గంగారెడ్డి, హనుమాన్లు, గంగారం, లక్కం సంజీవ్, తోగిటి అంజయ్య, భారత వీలింగారెడ్డి, కమిషన్ ఏజెంట్లు గంగాధర్, రమేష్, కార్మికులు సుధా, పద్మ, రాధిక, సుజాత, సబియా బేగం, మమత, ఆసియా బేగం, పర్వీన్ సుల్తానా, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>