మోదీని తొలగిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ: ఖర్గే

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీని తొలగిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి ర్యాలీ (INDIA Bloc Rally)లో ఖర్గే ప్రసంగిస్తూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సహా బీహార్, మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకోలేదని.. ఓట్ల చోరీ చేసి వారిని వారే ఎన్నుకున్నారని విమర్శించారు. వారిని కచ్చితంగా తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. యువత, మహిళలు, దళితుల ఓట్లను లాక్కునేందుకు మోదీ, అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్ ద్వారా ఓట్లను తొలగిస్తున్నారని.. ఆయన్ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవి నుంచి తొలగించే వరకు తాము విశ్రమించబోమన్నారు. ఇండియా కూటమి, మమ్మల్ని ఎంతగా భయపెట్టినా వెనక్కి తగ్గబోమన్నారు. ఎవరు ఓట్లు వేయాలనేది మోదీనే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. అలా ఎంపిక చేసిన ఓట్ల ద్వారానే మోదీ ప్రధాని అయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించారు. దొంగలను అధికారంలో నుంచి తొలగించాలన్నారు.

బెంగాల్ బాధితురాలిగా మారింది..

ర్యాలీలో పాల్గొన్న మాజీ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం కుట్రపూరితంగా చేపట్టిన సర్ ప్రక్రియకు బెంగాల్ బాధితురాలిగా మారిందన్నారు. అయినంత మాత్రాన తాము ఆందోళనలు ఆపే ప్రసక్తే లేదన్నారు. బెంగాల్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పడమే తమ లక్ష్యమన్నారు. రాజకీయాల ద్వారానే తాము ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. రాముడి ఆలయం హుండీ డబ్బులు, వక్ఫ్ భూములు.. ఇలా బీజేపీ దోచుకోనిది ఏదీ లేదన్నారు. పోలీసులు పూర్తిగా బీజేపీ పార్టీకి అనుబంధ సంఘంలా మారిపోయారని విమర్శించారు. ఏజెన్సీలు సొంతంగా పనిచేసే పరిస్థితి లేదని.. బీజేపీనే వాటిని నడిపిస్తోందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>