Mobile Popup Ad
Mobile Popup Ad

డీఎస్సీలో అవినీతి, అక్రమాలకు పాల్పడటం దారుణం: వైఎస్ జగన్

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా షాక్ కలిగిస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని చెప్పారు.

డీఎస్సీ అంటే లక్షల మంది యువత ఆశ, వారి భవిష్యత్తు అని.. అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడటం అత్యంత దారుణమని అన్నారు. అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకు, స్కాముకు ఒక షర్టు ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు అని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూసినా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా తన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అయినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా, అందులో అవకతవకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని విమర్శించారు. 16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయని అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ఒకే సమయంలో ఒకే నోటిఫికేషన్‌ ఇచ్చామని జగన్ గుర్తు చేశారు. లక్షా 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేశామని.. దేశ చరిత్రలోనే లేని విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే జీవో ఇచ్చామని చెప్పారు. 19 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక్క తప్పు కూడా జరగలేదని చెప్పుకొచ్చారు. నాలుగు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ భర్తీ పూర్తి చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం డీఎస్సీ పేరుతో అభ్యర్థులకు ఆవేదన మిగిల్చిందని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>