ఇదేం పిచ్చిపని.. కదిలే ట్రైన్‌లో యువకుల మద్యం పార్టీ..

కలం, వెబ్ డెస్క్ : మన దేశంలో కొందరు యువకుల తీరు చూస్తుంటే.. మరీ దారుణంగా అనిపిస్తోంది. సివిక్ సెన్స్ జీరో ఉందా లేదంటే.. వీళ్ల తీరే ఇంతనా అని అనిపించకమానదు. చట్టాలు, పోలీసులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా సరే పబ్లిక్ గా ఎలా బిహేవ్ చేయాలో ఇంకా తెలియట్లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కదులుతున్న ట్రైన్ లో కొందరు యువకులు మద్యం (Liquor Party) తాగుతున్నారు. అది కూడా పట్టపగలే.

చుట్టూ ప్రయాణికులు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నా కూడా వారు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ (Liquor Party) హల్ చల్ చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియట్లేదు గానీ.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Read Also: అసెంబ్లీలోకి మరో సంచలన బిల్.. రేపు క్యాబినెట్‌లో చర్చ

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>