గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో విషాదం.. యువకుడి మృతి

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌లో (Manjulapur) గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. మంజులాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో విగ్రహాన్ని ట్రాక్టర్‌పైకి ఎక్కిస్తుండగా ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన డెకరేషన్ ఇనుప ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన ఎంబడి శివకుమార్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిమజ్జన ఊరేగింపులు, విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ తీగల విషయంలో నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ లింబాద్రి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>