ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. హనుమకొండ (Hanumakonda) జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి గ్రామానికి చెందిన బండారి కుమారస్వామి (32) పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తూ నిరంతర ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఆ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఎన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో తన భర్త ఎంతో భాధపడ్డాడని కుమారస్వామి భార్య స్వప్న తెలిపింది. ఉద్యోగం రాకపోయినా వ్యవసాయం చేసుకుని జీవిద్దామని చెప్పినా వినిపించుకోలేదని ఆమె తెలిపింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన తరువాత పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుమారస్వామి భార్య స్వప్న తెలిపినట్లుగా.. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం మాత్రమే ఆత్మహత్యకు ప్రధాన కారణమని పోలీసులు ధృవీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>