కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి అంటే సినిమాల సందడి. కనీసం నాలుగైదు చిత్రాలు ప్రతి సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతుంటాయి. ఈ సారి ఇంకా పెద్ద సంఖ్యలో మూవీస్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు, ప్రభాస్ రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) అనగనగ ఒక రాజు చిత్రాలు ఉన్నాయి. ఈసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు ఇద్దరు యంగ్ హీరోలు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి.
రిలీజ్ కు ముందు క్రేజ్ పరంగా చూస్తే ఈ ఇద్దరి సినిమాలపై అంతగా అంచనాలు లేవు. రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలపైనే ప్రేక్షకులు ఫోకస్ చేశారు. ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఈ ఇద్దరు యంగ్ హీరోలు మంచి సక్సెస్ అందుకున్నారు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) అనగనగ ఒక రాజు చిత్రాలు హిలేరియస్ కామెడీతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
శర్వానంద్ కు ఇటీవల దక్కని సక్సెస్ ఈ మూవీతో రాగా, గాయం కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన నవీన్ పోలిశెట్టికి మంచి కమ్ బ్యాక్ మూవీ అయ్యింది అనగనగ ఒక రాజు. ఈ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు కూడా రిలీఫ్ లాంటి విజయాన్ని అందించింది. మంచి ఎంటర్ టైనర్ మూవీస్ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఈ రెండు చిత్రాలు మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. తమ కొత్త చిత్రాలతో పండక్కి హిట్ కొట్టేశారు యంగ్ హీరోలు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి.


