Mobile Popup Ad
Mobile Popup Ad

ఆధార్ మన గుర్తింపు.. సేవలను వినియోగించుకోవాలి: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్‌‌ (Mahabubnagar) జిల్లా గణేష్ నగర్‌లోని ఆధార్ సేవా కేంద్రంలో అందిస్తున్న సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) సూచించారు. గణేష్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధార్ సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్న సేవల గురించి, నిర్వహన గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన (Srinivas Reddy) మాట్లాడుతూ.. మన ఆధార్ మన గుర్తింపు కాబట్టి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు, సవరణలు ఉన్న ఎలాంటి సందేహం లేకుండా ఈ ఆధార్ సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డును పీవీసీ కార్డు రూపంలో ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ వెన్నెల రఘు, పాలమూరు యూనివర్సిటీ ఓఎస్డీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, నాయకులు గోవింద్ యాదవ్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: లబ్ధిదారులు కాదు..ఇకపై బస్సుల యజమానులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>