Mobile Popup Ad
Mobile Popup Ad

అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్

క‌లం, మెద‌క్ బ్యూరో: బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam ) విరుచుకుపడ్డారు. అవగాహన లేకుండా మాట్లాడుతూ ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నాడని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన విధంగా అవినీతి జరుగుతుందనే భావన లో హరీశ్ రావు ఉన్నాడని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు మైనార్టీ , బీసీ,ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల్లో అవినీతి చూపిస్తే దేనికైనా సిద్ధమని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. పేదలకు మెరుగైన‌ విద్య, నాణ్యమైన ఆహారం ఉండాలనే ఆలోచన తమకు ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. తమ శాఖల్లో తప్పు జరిగినట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.

ఈ క్రమంలోనే ఒక మైనార్టీ ,ఒక ఎస్సీ ,ఒక బీసీ మంత్రులుగా ఉన్న శాఖల్లో అవినీతి జరిగిందని హరీశ్ రావు చులకనగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మైనార్టీ , బీసీ,ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల్లో మంత్రులుగా తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>