Mobile Popup Ad
Mobile Popup Ad

మెస్సీ జెర్సీలో జైస్వాల్ సందడి.. వీడియో వైరల్

కలం, స్పోర్ట్స్ : టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) క్రికెట్‌కు విరామం దొరకడంతో ఫిఫా ప్రపంచకప్-2026 (FIFA World Cup 2026) మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. అమెరికాలోని న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫ్రాన్స్–స్వీడన్ ప్రీక్వార్టర్ మ్యాచ్‌కు హాజరైన జైస్వాల్, అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) జెర్సీ ధరించి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

స్టేడియంలో గడిపిన అనుభవాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్న జైస్వాల్ (Yashasvi Jaiswal), దానికి “బకెట్ లిస్ట్” అనే క్యాప్షన్ జోడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్‌ను ఓడించి ప్రీక్వార్టర్ దశను విజయవంతంగా దాటింది. స్టార్ ఫార్వర్డ్ కిలియన్ ఎంబాప్పే రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, మైఖేల్ ఒలిసే తన అద్భుతమైన అసిస్టులతో ఆకట్టుకున్నాడు. ఈ రెండు గోల్స్‌తో ఎంబాప్పే ఈ ప్రపంచకప్‌లో తన గోల్స్ సంఖ్యను ఆరుకు పెంచుకుని గోల్డెన్ బూట్ రేసులో లియోనెల్ మెస్సీతో సమంగా నిలిచాడు. అలాగే ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్య 18కు చేరింది. తదుపరి రౌండ్‌లో ఫ్రాన్స్ పరాగ్వేతో తలపడనుంది.

 

View this post on Instagram

 

A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28)

Read Also: రూ.32 లక్షల జాబ్‌ని వదులుకున్న యువతి.. ఎందుకో తెలుసా!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>