కలం, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో ఈ నెల 8న నూతన బస్టాండ్‌కు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేస్తారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) తెలిపారు. పట్టణంలో బస్ డిపో వద్ద నిర్మించనున్న నూతన బస్టాండ్ స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. నూతన బస్టాండ్ నిర్మాణంతో జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య, కౌన్సిలర్ నిజాం, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also: రూ.32 లక్షల జాబ్‌ని వదులుకున్న యువతి.. ఎందుకో తెలుసా!
Follow Us On: Instagram

