కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట (Suryapet) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రియుడు తనను దూరం పెడుతుందనే కారణంలో ప్రియురాలిపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని స్నేహానగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…. సూర్యాపేటకు చెందిన మహేష్, స్నేహానగర్‌కు చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల సదరు యువతి మహేష్‌ను దూరం పెడుతూ వస్తోంది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మహేష్ కొంతకాలంగా అసహనంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఎవ్వరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి వెళ్లాడు. ఏమైందో ఏమోగానీ సుత్తితో యువతి తలపై బలంగా దాడి చేశాడు. దీంతో ఆ యువతి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు మహేష్‌ను పట్టుకుని స్థంభానికి కట్టేసి చితకబాదారు. మరోవైపు గాయపడిన సదరు యువతిని సూర్యాపేట (Suryapet) స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: పెళ్లిళ్ల సీజన్… పెరుగుతున్న బంగారం, వెండి ధరలు!
Follow Us On : WhatsApp


